కోమటిరెడ్డి సోదరులు రూ.1కోటి విరాళం
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం రూ.1కోటి సాయం ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సీడీసీ నిధుల నుంచి రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి ప్రకటించారు. తెలంగాణను కరోనా కబళించే అవకాశం ఉన్నందున సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని […]
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం రూ.1కోటి సాయం ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సీడీసీ నిధుల నుంచి రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి ప్రకటించారు. తెలంగాణను కరోనా కబళించే అవకాశం ఉన్నందున సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 59పాజిటివ్ కేసులు నమోదు కావడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.సీఎం సహాయనిధికి ప్రకటించిన రూ.కోటితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసేందుకు వినియోగించాలని సీఎం కేసీఆర్ ను కోరారు.కరోనా నియంత్రణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలెంటర్ల్లుగా పని చేయడానికి సంసిద్ధులుగా ఉండాలని పిలుపునిచ్చారు.
Tags : komatireddy brothers, 1 crore funding, corona, cmrf fund, to control virus