కోమటికి జాతీయ పుడమి పురస్కారం

దిశ తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రాని చెందిన గ్రంధాలయ చైర్మెన్ కోమటి మత్స్యగిరి (ఛత్రపతి)జాతీయ పుడమి పురస్కారం అందుకున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని కళా ప్రపూర్ణ నాయని వెంకట రంగారావు భవనం రాజా వారి కోటజాతీయ జెండా రూపొంచించబడిన స్థలంలో ప్రధానం చేసిన జాతీయ పుడమి పురస్కారం-2020 ని అందుకున్నారు. మత్స్యగిరి చేస్తున్న సాహితీ, సామాజిక సేవలకు గుర్తింపుగా జాతీయ పురస్కారాన్ని డాక్రీ మేనేజింగ్ (డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ […]

Update: 2020-08-05 03:47 GMT

దిశ తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రాని చెందిన గ్రంధాలయ చైర్మెన్ కోమటి మత్స్యగిరి (ఛత్రపతి)జాతీయ పుడమి పురస్కారం అందుకున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని కళా ప్రపూర్ణ నాయని వెంకట రంగారావు భవనం రాజా వారి కోటజాతీయ జెండా రూపొంచించబడిన స్థలంలో ప్రధానం చేసిన జాతీయ పుడమి పురస్కారం-2020 ని అందుకున్నారు.

మత్స్యగిరి చేస్తున్న సాహితీ, సామాజిక సేవలకు గుర్తింపుగా జాతీయ పురస్కారాన్ని డాక్రీ మేనేజింగ్ (డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్ కుర్రా జితేందర్ బాబు, ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ పులికొండ సుబ్బయ్య చారి, నిజాం కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పగడాల నాగేందర్ చేతుల మీదుగా పుడమి జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యగిరిని జాతీయ అవార్డు, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మోత్కూర్ లో గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణలో ప్రత్యేకత, కరోనా లాక్ డౌన్ సమయంలో 55 రోజుల పాటు కరోనా కవనాలు పేరుతో లాక్ డౌన్ ఎత్తేసేవరకు వరుసగా రోజుకొక్క కవితతో ప్రజల్ని చైతన్యపరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇంకా సాహితీ సేవలో, సమాజ సేవలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలని ముఖ్య అతిధులు సూచించారు.

పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల సునీత, డాక్రీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కె.హిమబిందు, పుడమి సభ్యులు మోత్కూరి శ్రీనివాస్, బూరుగు గోపి కృష్ణ, గొల్లబోయిన అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News