వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి కొల్లాపూర్, అచ్చంపేట సివిల్ ఆసుపత్రులు..
దిశ, నాగర్‌కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో కొల్లాపూర్, అచ్చంపేట సివిల్ ఆసుపత్రుల నిర్వహణను వైద్య విధాన పరిషత్‌కు అప్పగిస్తున్నట్టు డీఎం హెచ్‌ఓ సుధాకర్ లాల్ తెలిపారు. గురువారం దానికి సంబంధించిన పత్రాలను పాలెంలోని జిల్లా కార్యాలయంలో పర్యవేక్షకులు రమేష్ చంద్రకు అప్పగించారు. ఈ ఆసుపత్రులలో నాణ్యమైన స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయని, ఆయా ప్రాంత ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ […]
దిశ, నాగర్‌కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో కొల్లాపూర్, అచ్చంపేట సివిల్ ఆసుపత్రుల నిర్వహణను వైద్య విధాన పరిషత్‌కు అప్పగిస్తున్నట్టు డీఎం హెచ్‌ఓ సుధాకర్ లాల్ తెలిపారు. గురువారం దానికి సంబంధించిన పత్రాలను పాలెంలోని జిల్లా కార్యాలయంలో పర్యవేక్షకులు రమేష్ చంద్రకు అప్పగించారు.
ఈ ఆసుపత్రులలో నాణ్యమైన స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయని, ఆయా ప్రాంత ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆసుపత్రులలో దశల వారీగా అత్యుత్తమ సేవలు అందిస్తామన్నారు. కొల్లాపూర్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్, అచ్చంపేట సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి రేణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.