ఉత్కంఠ పోరులో కోల్‌కత్తా గెలుపు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 21 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై చతికిల పడింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అంబటి రాయుడు 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ కూడా క్రీజులో కుదురుకోలేదు. డిప్లెసిస్(17), ఎంస్ ధోని(11), శ్యామ్ కుర్రాన్ (17) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో చివరి ఓవర్‌లో క్రీజులో నిలబడ్డ కేదర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 21 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై చతికిల పడింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అంబటి రాయుడు 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ కూడా క్రీజులో కుదురుకోలేదు.
డిప్లెసిస్(17), ఎంస్ ధోని(11), శ్యామ్ కుర్రాన్ (17) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో చివరి ఓవర్‌లో క్రీజులో నిలబడ్డ కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా బౌండరీలకు ప్రయత్నించినా వీలు పడలేదు. నిర్దిష్ఠ 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 10 పరుగుల తేడాతో రైడర్స్ గెలుపొందారు.
తొలి ఇన్నింగ్స్ సాగిందిలా….
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు రాహుల్ త్రిపాఠి మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్లు షాక్ ఇచ్చారు. వచ్చినవారు కాసేపు క్రీజులో నిలబడకుండా పెవిలియన్ బాట పట్టారు. 37 పరుగుల వద్ద యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్(11) శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా ఎంతసేపు క్రీజులో నిలబడలేదు. కర్న్ శర్మ వేసిన బంతికి షాట్ ఆడబోయి రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 70 పరుగుల వద్ద కోల్‌కతా 2 కీలక వికెట్లు కోల్పోయింది.
ఇక అప్పటికే క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠికి.. మిడిలార్డర్‌లో వచ్చిన సునీల్ నరైన్ (17) ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి కాస్తా ఉత్తేజాన్ని నింపాడు. అయినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 11వ ఓవర్ చివరి బంతిని కొట్టబోయి డుప్లెసిస్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇయాన్ మోర్గాన్(7), ఆండ్రూ రస్సెల్(2) పరుగులకే చేతులెత్తేశారు. ఇక అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ త్రిపాఠి తన ఇన్నింగ్స్ కొనసాగించాడు.
తొలి ఓవర్ నుంచి ఏకధాటిగా బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి కోల్‌కతా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఇక 17వ ఓవర్‌లో బ్రావో వేసిన బంతిని అడ్డుకోబోయే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్‌కు బాల్ తగలడంతో వాట్సాన్‌కు క్యాచ్ వెళ్లింది. దీంతో 140 పరుగుల వద్ద కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ ప్లేయర్స్ చెన్నై బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి కోల్‌కతా 167 పరుగులు చేయగలిగింది.