చీల్చి చెండాడిన చక్రవర్తి.. ఢిల్లీ చిత్తు చిత్తు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను వరుణ్ చక్రవర్తి చీల్చి చెండాడాడు. ఏకధాటిగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను వన్‌ సైడ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసుకొని ఐపీఎల్ చరిత్రలో నూతన రికార్డులకు తెరలేపాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితం అయింది. దీంతో 59 పరుగుల భారీ తేడాతో ఈ సీజన్‌లో కోల్‌కతా తొలిసారిగా అనూహ్యా విజయం […]

Update: 2020-10-24 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను వరుణ్ చక్రవర్తి చీల్చి చెండాడాడు. ఏకధాటిగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను వన్‌ సైడ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసుకొని ఐపీఎల్ చరిత్రలో నూతన రికార్డులకు తెరలేపాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితం అయింది. దీంతో 59 పరుగుల భారీ తేడాతో ఈ సీజన్‌లో కోల్‌కతా తొలిసారిగా అనూహ్యా విజయం సాధించింది.

ఢిల్లీ ఇన్నింగ్స్:

టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న డేరింగ్ టీమ్‌ ఢిల్లీ జట్టుకు కోల్‌కతా ఊహించని షాక్ ఇచ్చింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢీల్లీ బ్యాట్స్‌మెన్లు బోల్తా పడ్డారు. తొలి ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ తొలి బంతికే అజింక్య రహనేను(0) డకౌట్ చేశాడు. ఈ వికెట్‌తో ఢిల్లీ పతనానికి నాంది పడినట్టు.. 13 పరుగుల వద్దనే శిఖర్ ధావన్(6) కూడా అవుట్ అయ్యాడు. తిరిగి మూడో ఓవర్ వేసిన కమ్మిన్స్ గబ్బర్‌ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో 13 పరుగుల వద్దనే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లను కోల్పోయింది.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కాసేపు క్రీజులో కుదురుకున్నాడు. అతడికి తోడుగా రిషబ్ పంత్‌కూడా కుదురుకుంటున్న సమయంలో కోల్‌కతా స్పిన్నర్ మ్యాచ్‌ను మొత్తం మలుపుతిప్పాడు. అప్పటికే 27 పరుగులు చేసి ఊపు మీద ఉన్న రిషబ్ పంత్‌ను క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన షిమ్రాన్ హెట్మేయర్‌ను కూడా 10 పరుగులకే పడగొట్టాడు. దీంతో 95 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టుకు మరో ఎదురుదెబ్బ తాకింది. 95 పరుగుల వద్దనే హార్డ్ హిట్టర్ శ్రేయాస్ అయ్యర్‌ను సైతం చక్రవర్తి తర్వాతి బంతికే క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ చతికిల పడింది. ఇక స్టోయినిస్‌ (6), అక్సర్ పటేల్(9) పరుగులు చేయగానే చక్రవర్తి పెవిలియన్ పంపాడు. ఈ పరిణామాల మధ్య 112 పరుగులకే ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (14*), తుషర్ దేశ్ పాండే (1) పరుగు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్‌కతా నైట్ డైడర్స్ 42వ మ్యాచులో ఘన విజయం సాధించారు.

చక్రవర్తి విశ్వరూపం:

42వ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి విశ్వరూపం చూపించాడు. ఏకధాటిగా వికెట్లు తీసి సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇదే మ్యాచ్‌లో అనూహ్య పరిణామం ఏంటంటే వరుసగా 3,4,5,6,7వ స్థానాల్లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మేయర్, మార్య్కుస్ స్టోయినిస్, అక్సర్ పటేల్‌ను వరుణ్ ఒక్కడే పడగొట్టాడు. 4 ఓవర్లు వేసిన చక్రవర్తి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీయడం గమనార్హం. ఈ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకున్న తొలి ఆటగాడిగా కూడా వరుణ్ చక్రవర్తి రికార్డు నెలకొల్పాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్:

ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్వ వైభవాన్ని చాటారు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కాసింత టెన్షన్ పెట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKR జట్టు ఢిల్లీ ముందు భారీ స్కోర్‌ను నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ నితీష్ రానా(81), సునీల్ నరైన్ (64)లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగులు చేసి ఓటమి పాలైన కేకేఆర్.. రెండోసారి 194 పరుగుల స్కోరు చేసింది. ఇక ఢిల్లీ ముందు భారీ స్కోర్‌ (195) ఉండడంతో కావడంతో గెలుచేది ఎవరో అన్న అంశం ఆసక్తిని రేపుతోంది.

ఇన్నింగ్స్ సాగిందిలా…

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు తొలుత తడబడింది. కేవలం 11 పరుగుల వద్దనే ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను(9) క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో ఉన్న నితీష్ రానా బాల్‌ టు బాల్ ఆడుతూ వచ్చాడు. ఇదే సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(13) ఔట్ అయ్యాడు. 35 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌కు.. మిడిలార్డర్‌లో వచ్చిన దినేష్ కార్తీక్(3) పరుగులు మాత్రమే చేసి 42 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 7.2 ఓవర్లకే కేకేఆర్ 3 కీలక వికెట్లను కోల్పోయింది.

సునీల్ నరైన్-నితీష్ రానా బ్యాక్ టు ఫామ్:

ఇక తొలి నుంచి క్రీజులో నిలబడ్డ నితీష్ రానాకు.. హార్డ్ హిట్టర్ సునీల్ నరైన్ బ్యాక్ టు ఫామ్ అంటూ చెలరేగిపోయాడు. దీంతో అప్పటివరకు బాల్ టు బాల్ ఆడిన రానాకు మంచి భాగస్వామ్యం లభించడంతో ఆకాశమే హద్దుగా ఆడారు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో నరైన్ 64 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక తొలి నుంచే ఉన్న రానా 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 81 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వీరిద్దరు చెలరేగిన వేళ కేకేఆర్‌ స్కోర్‌ 200 వైపు దూసుకెళ్లినా.. చివరి నిమిషంలో ఇద్దరు వికెట్ కోల్పోయారు. ఇక 6వ స్థానంలో వచ్చిన మోర్గాన్ (19) పరుగులు చేశాడు. 20 ఓవర్‌లో చివరి బంతికి షాట్ ఆడబోయిన మోర్గాన్ స్టోయినిస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

Kolkata Knight Riders Innings: 194-6 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c అక్సర్ b నొర్జే 9(8)
2. నితీష్ రానా c తుషర్ దేశ్‌పాండే b స్టోయినిస్ 81(53)
3. రాహుల్ త్రిపాఠి b నొర్ట్జే 13(12)
4. దినేష్ కార్తీక్ (wk)c పంత్ b రబాడా 3(6)
5. సునీల్ నరైన్ b రబాడా 64(32)
6. ఇయాన్ మోర్గాన్ c రబాడా b స్టోయినిస్ 17(9)
7. ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 194-6

వికెట్ల పతనం: 11-1 (శుబ్‌మన్ గిల్, 1.5), 35-2 (రాహుల్ త్రిపాఠి, 5.4), 42-3 (దినేష్ కార్తీక్, 7.2), 157-4 (సునీల్ నరైన్, 16.4), 194-5 (నితీష్ రానా, 19.5), 194-6 (ఇయాన్ మోర్గాన్, 19.6)

బౌలింగ్:

1. తుషర్ దేశ్‌పాండే 4-0-40-0
2. ఎన్రిచ్ నొర్ట్జే 4-0-27-2
3. కగిసో రబాడా 4-0-33-2
4. అక్సర్ పటేల్ 1-0-7-0
5. మార్క్యుస్ స్టోయినిస్ 4-0-41-2
6. రవిచంద్రన్ అశ్విన్ 3-0-45-0

Delhi Capitals Innings: 135-9 (20 Ov)
1. అజింక్య రహనే lbw b కమ్మిన్స్ 0(1)
2. శిఖర్ ధావన్ b కమ్మిన్స్ 6(6)
3. శ్రేయాస్ అయ్యర్ (c)c కే.నాగర్‌కోటి b చక్రవర్తి 47(38)
4. రిషబ్ పంత్ (wk)c శుబ్‌మన్ గిల్ bచక్రవర్తి 27(33)
5. షిమ్రాన్ హెట్మేయర్ c త్రిపాఠి b చక్రవర్తి 10(5)
6. మార్య్కుస్ స్టోయినిస్ c త్రిపాఠి b చక్రవర్తి 6(6)
7. అక్సర్ పటేల్ b చక్రవర్ది 9(7)
8. కగిసో రబాడా c త్రిపాఠి b కమ్మిన్స్ 9(10)
9. రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 14(13)
10. తుషర్ దేశ్‌పాండే c మోర్గాన్ b లాకీ ఫెర్గూసన్ 1(3)
11. ఎన్రిచ్ నొర్ట్జే నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 135-9

వికెట్ల పతనం: 0-1 (అజింక్య రహనే, 0.1), 13-2 (శిఖర్ ధావన్, 2.3), 76-3 (రిషబ్ పంత్, 11.2), 95-4 (షిమ్రాన్ హెట్మేయర్, 13.2), 95-5 (శ్రేయాస్ అయ్యర్, 13.3), 110-6 (మార్య్కుస్ స్టోయినిస్, 15.1), 112-7 (అక్సర్ పటేల్, 15.5), 132-8 (కగిసో రబాడా, 18.5), 135-9 (తుషర్ దేశ్‌పాండే, 19.5).

బౌలింగ్:

1. ప్యాట్ కమ్మిన్స్ 4-0-17-3
2. ప్రసీద్ కృష్ణ 2-0-19-0
3. కమలేష్ నాగర్‌కోటి 2-0-11-0
4. లాకీ ఫెర్గూసన్ 4-0-30-1
5. సునీల్ నరైన్ 4-0-37-0
6. వరుణ్ చక్రవర్తి 5-0-20-5

Tags:    

Similar News