కెప్టెన్ మారినా.. ఆట మారలేదు
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ మారి ఇయాన్ మోర్గాన్ వచ్చిన ఆట తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే క్రీజులో నుంచి పెవిలియన్ చేరుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇయాన్ మోర్గాన్ పథకం వేశాడనుకుంటే.. బ్యాట్స్‌మెన్లు మాత్రం బోల్తా కొట్టించారు. కేవలం 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్(21), నితీష్ రానా(5), దినేష్ కార్తీక్ (4) […]
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ మారి ఇయాన్ మోర్గాన్ వచ్చిన ఆట తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే క్రీజులో నుంచి పెవిలియన్ చేరుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇయాన్ మోర్గాన్ పథకం వేశాడనుకుంటే.. బ్యాట్స్‌మెన్లు మాత్రం బోల్తా కొట్టించారు. కేవలం 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్(21), నితీష్ రానా(5), దినేష్ కార్తీక్ (4) పరుగులు చేసి చేతులెత్తేశారు. 8 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు 43/4గా ఉంది. ప్రస్తుతం క్రీజులో ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ ఉన్నారు.