పర్యాటకంగా కోయిల్ సాగర్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మంత్రి కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోయిల్ సాగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. త్వరలో హరిత హోటల్, హాట్స్, బోటింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు.

Update: 2020-08-29 06:12 GMT

Tags:    

Similar News