కోహ్లీ సేన పాకిస్థాన్ జట్టులా ఆడుతోంది: సంజయ్ మంజ్రేకర్

       న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లో 5-0 తేడాతో ఓడించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐదో టీ20లో భారత్ పుంజుకున్న విధానాన్ని సీనియర్లు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత టీమిండియా ఆటతీరును పాకిస్థాన్ జట్టుతో పోల్చి అభినందించాడు. ‘‘న్యూజిలాండ్‌లో ఉన్న కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు.. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాక్ జట్టును గుర్తు చేస్తోంది. బలమైన సెల్ఫ్ డిఫెన్స్ జట్టులో పుష్కలంగా ఉంది. పరాజయం అంచుకు చేరుకున్న జట్టును గట్టెక్కించేందుకు ఇమ్రాన్ […]

Update: 2020-02-03 20:42 GMT

న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లో 5-0 తేడాతో ఓడించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐదో టీ20లో భారత్ పుంజుకున్న విధానాన్ని సీనియర్లు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత టీమిండియా ఆటతీరును పాకిస్థాన్ జట్టుతో పోల్చి అభినందించాడు. ‘‘న్యూజిలాండ్‌లో ఉన్న కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు.. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాక్ జట్టును గుర్తు చేస్తోంది. బలమైన సెల్ఫ్ డిఫెన్స్ జట్టులో పుష్కలంగా ఉంది. పరాజయం అంచుకు చేరుకున్న జట్టును గట్టెక్కించేందుకు ఇమ్రాన్ కూడా వివిధ మార్గాలు వెతికేవాడు. మనపై మనకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది’’ అని అన్నాడు. కాగా, 90లలో పాక్ జట్టు అభేద్యమైన జట్టుగా పేరొందింది. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ తదితరులు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేస్తే, రమీజ్ రజా, సయీద్ అన్వర్, సలీమ్ మాలిక్, జావెద్ మియాందాద్ వంటి ఆటగాళ్లు బ్యాటుతో రాణించి జట్టును విజయపథాన నిలిపే వాళ్లని మంజ్రేకర్ తెలిపాడు.

Tags:    

Similar News