కుల్దీప్‌‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన కోహ్లీ

దిశ, స్పోర్ట్స్ : చెన్నై టెస్టు తుది జట్టులో కుల్దీప్ యాదవ్ బదులు షాబాజ్ నదీమ్‌ను తీసుకున్నారు. దీనిపై తొలి రోజు నుంచే తీవ్రమైన విమర్శలు వెలువడ్డాయి. నదీమ్ ఈ టెస్టులో పెద్దగా ప్రభావం చూపకపోగా.. రెండు సార్లు కూడా డకౌట్ అయ్యాడు. దీనిపై మ్యాచ్ అనంతరం విలేకర్లు ప్రశ్నించగా కోహ్లీ స్పష్టతనిచ్చాడు. ‘కుల్దీప్‌ను తీసుకోనందకు చింతించడం లేదు. మా జట్టులో ఇప్పటికే అశ్విన్, సుందర్ వంటి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఎడమ […]

Update: 2021-02-09 11:10 GMT

దిశ, స్పోర్ట్స్ : చెన్నై టెస్టు తుది జట్టులో కుల్దీప్ యాదవ్ బదులు షాబాజ్ నదీమ్‌ను తీసుకున్నారు. దీనిపై తొలి రోజు నుంచే తీవ్రమైన విమర్శలు వెలువడ్డాయి. నదీమ్ ఈ టెస్టులో పెద్దగా ప్రభావం చూపకపోగా.. రెండు సార్లు కూడా డకౌట్ అయ్యాడు. దీనిపై మ్యాచ్ అనంతరం విలేకర్లు ప్రశ్నించగా కోహ్లీ స్పష్టతనిచ్చాడు. ‘కుల్దీప్‌ను తీసుకోనందకు చింతించడం లేదు.

మా జట్టులో ఇప్పటికే అశ్విన్, సుందర్ వంటి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఎడమ చేత్తో లెగ్ స్పిన్ వేస్తాడు. అది ఆఫ్ స్పిన్ వంటిదే. అందుకే బౌలింగ్‌లో వైవిధ్యం కోసం షాబాజ్ నదీమ్‌ను తీసుకున్నాము’ అని కోహ్లీ అన్నాడు. కాగా, కుల్దీప్ యాదవ్ 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.

Tags:    

Similar News