క్యాచ్ వదిలిన కోహ్లీ.. ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్-బెంగుళూరు మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాల్ ఏ వైపు నుంచి, ఎలా వచ్చిన అప్రమత్తతతో క్యాచ్ పట్టే విరాట్ కోహ్లీ కీలక బ్యాట్స్‌మెన్‌కు లైఫ్ ఇచ్చాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఇదే సమయంలో ఓ సిక్స్ కొట్టాడు. అదే ఉత్సాహంతో మరో సిక్స్ కొట్టబోయి కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అయిన చేతికొచ్చిన క్యాచ్‌ను కోహ్లీ చేజేతులారా వదిలేశాడు. ఆ […]
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్-బెంగుళూరు మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాల్ ఏ వైపు నుంచి, ఎలా వచ్చిన అప్రమత్తతతో క్యాచ్ పట్టే విరాట్ కోహ్లీ కీలక బ్యాట్స్‌మెన్‌కు లైఫ్ ఇచ్చాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఇదే సమయంలో ఓ సిక్స్ కొట్టాడు. అదే ఉత్సాహంతో మరో సిక్స్ కొట్టబోయి కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అయిన చేతికొచ్చిన క్యాచ్‌ను కోహ్లీ చేజేతులారా వదిలేశాడు. ఆ తర్వాత నిరుత్సాహానికి గురైయ్యాడు. ఇది చాలదు అనుకుంటే కేఎల్ రాహుల్ కొట్టిన మరో బంతి చేతిలోకి వచ్చిన వదిలేయడం పలు అనుమానాలకు దారి తీసింది. ఒకే బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని కోహ్లీ రెండు సార్లు వదిలేయడం గమనార్హం.