పడిపోయిన కోహ్లీ ర్యాంకు

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 5వ ర్యాంకుకు పడిపోయాడు. ఐసీసీ బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో కోహ్లీ ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంకుకు పడిపోయాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. మరోవైపు చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 883 రేటింగ్ పాయింట్స్‌తో రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. మార్నస్ […]

Update: 2021-02-10 08:38 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 5వ ర్యాంకుకు పడిపోయాడు. ఐసీసీ బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో కోహ్లీ ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంకుకు పడిపోయాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. మరోవైపు చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 883 రేటింగ్ పాయింట్స్‌తో రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. మార్నస్ లబుషేన్ ఒక ర్యాంకు కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్ బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక చతేశ్వర్ పుజారా ఒక స్థానం కోల్పోయి 7వ ర్యాంకులో స్థిరపడ్డాడు. చెన్నై టెస్టులో భారత బ్యాట్స్‌మాన్ విఫలం కావడంతో వారి ర్యాంకులు గణనీయంగా పడిపోయాయి.

టెస్టు ర్యాంకులు

1. కేన్ విలియమ్ సన్ (919 రేటింగ్ పాయింట్లు)
2. స్టీవ్ స్మిత్ (891)
3. జో రూట్ (883)
4. మార్నస్ లబుషేన్ (878)
5. విరాట్ కోహ్లీ (852)
6. బాబర్ ఆజమ్ (760)
7. చతేశ్వర్ పుజార (754)
8. హెన్రీ నికోలస్ (747)
9. బెన్ స్టోక్స్ (746)
10. డేవిడ్ వార్నర్ (724)

Tags:    

Similar News