సాగర్ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం: కోదండరామ్
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎవరికీ మద్దతివ్వమని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పదవికాంక్షతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎన్నికల్లో తనకు ప్రజాసంఘాలు బాగా మద్దతు తెలిపాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర బహిరంగంగా డబ్బులు పంచారని ఆరోపించారు. మేధావులు మౌనం వహించడం ప్రమాదకరమని, ప్రభుత్వానికి రాబోయే రోజులు అన్ని గడ్డు పరిస్థితులేనని కోదండరామ్ విమర్శించారు. అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం […]
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎవరికీ మద్దతివ్వమని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పదవికాంక్షతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎన్నికల్లో తనకు ప్రజాసంఘాలు బాగా మద్దతు తెలిపాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర బహిరంగంగా డబ్బులు పంచారని ఆరోపించారు.
మేధావులు మౌనం వహించడం ప్రమాదకరమని, ప్రభుత్వానికి రాబోయే రోజులు అన్ని గడ్డు పరిస్థితులేనని కోదండరామ్ విమర్శించారు. అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, కోదండరామ్ మూడో స్థానంలో నిలిచారు.
కాగా, ఎవరికి మద్దతిచ్చేది లేదని కోదండరామ్ ప్రకటించంతో.. తెలంగాణ జనసమితి ఒంటరిగా బరిలోకి దిగుతుందా? అనే చర్చ జరుగుతోంది.