పోడు భూములు గుంజుకోవడం చట్ట వ్యతిరేకం….

దిశ,కొత్తగూడెం: గిరిజన ప్రాంతంలో పోడు భూములు గుంజుకోవడం చట్ట వ్యతిరేకమని ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను ఉదయం కలిసి వారికి ఓటు నమోదు మీద అవగాహన, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ […]

Update: 2020-10-21 04:39 GMT

దిశ,కొత్తగూడెం:
గిరిజన ప్రాంతంలో పోడు భూములు గుంజుకోవడం చట్ట వ్యతిరేకమని ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను ఉదయం కలిసి వారికి ఓటు నమోదు మీద అవగాహన, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిరస్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఇల్లు కోల్పోయిన ప్రతి గిరిజనుడికీ ప్రభుత్వమే స్థలం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News