ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయ్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, మునగాల: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నాడని తెలిపారు. గురువారం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో 49 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 49 లక్షల 5 వేల 684 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే […]

Update: 2021-05-27 06:20 GMT
Kodad MLA Bollam Mallaiah Yadav
  • whatsapp icon

దిశ, మునగాల: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నాడని తెలిపారు. గురువారం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో 49 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 49 లక్షల 5 వేల 684 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరంతరం ప్రజా సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News