కవిత లెక్క తప్పింది.. గాంధీ భవన్​లో మీడియాతో ఈరవర్తి అనిల్

బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెక్కలు తప్పిందని.. అందుకే ఆమెను నిజామాబాద్ లో ప్రజలు ఓడించారని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ విమర్శించారు.

Update: 2025-03-29 16:11 GMT
కవిత లెక్క తప్పింది.. గాంధీ భవన్​లో మీడియాతో ఈరవర్తి అనిల్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెక్కలు తప్పిందని.. అందుకే ఆమెను నిజామాబాద్ లో ప్రజలు ఓడించారని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత బడ్జెట్ లెక్కలపై అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్​లోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శిచరణ్ కౌశిక్ యాదవ్ తో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈరవర్తి అనిల్ కవతి వ్యాఖ్యలపై కౌంటర్ ఏటాక్​ చేశారు. మాజీ సీఎం కల్వంకుట్ల చంద్రశేఖర్​రావు కుటుంబ పత్రిక లెక్కలు తప్పిందని దుయ్యబట్టారు. తెలంగాణ అప్పు సీఎం తప్పు చెబుతున్నారని కవిత మాట్లాడడం సరైంది కాదన్నారు.

తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లు అని కవిత చెబుతోందని, కవిత లెక్క తప్పింది కనకనే నిజామాబాద్ లో ఆమె ప్రజలు ఓడించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తర్వాతా 90 వేల కోట్లు.. ఎఫ్ఆర్ బీఎం 78వేల కోట్లు.. ఎస్​పీవీ 11 వేల కోట్లు, కార్పొరేషన్ లోన్లు 5వేల కోట్లు అని, రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​కు అప్పగిస్తే.. 7లక్షల 28వేల కోట్ల అప్పు పదేళ్లలో చేశారని విమర్శించారు. కార్పొరేషన్ లోన్లు ఒక లక్ష 27వేల కోట్లు, కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ రోజునే వచ్చేదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ హయంలో అలా చేయలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, పెండింగ్ బిల్లులు, అగ్రికల్చర్ ఉచిత కరెంట్ కు లక్ష కోట్లు చెల్లించాల్సింది ఉందన్నారు. బీఆర్ఎస్​సర్కారు పదేళ్లలో 8లక్షల 19 వేల ఒక వంద 58 కోట్లు అప్పులు చేశారని ఈ సందర్భంగా ఈరవర్తి అనిల్ స్పష్టం చేశారు.

Similar News