బీసీసీఐ సస్పెన్షన్ పాఠాలు నేర్పింది: రాహుల్
దిశ, స్పోర్ట్స్: ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన సహచర క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో కలసి పాల్గొన్న కేఎల్ రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై బీసీసీఐ తాత్కాలిక నిషేధం విధించింది. కాగా, బీసీసీఐ నిషేధం తనలో కసిని పెంచిందని, దాంతో ఇకపై తన కోసం, రికార్డుల కోసమే ఆడాలని నిర్ణయించుకున్నట్లు కేఎల్ రాహుల్ తెలిపాడు. ఒక జాతీయ మీడియా సంస్థతో రాహుల్ పలు విషయాలు పంచుకున్నాడు. బీసీసీఐ నిషేధంతో తనలో స్వార్థం పెరిగిపోయిందన్నాడు. […]
దిశ, స్పోర్ట్స్: ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన సహచర క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో కలసి పాల్గొన్న కేఎల్ రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై బీసీసీఐ తాత్కాలిక నిషేధం విధించింది. కాగా, బీసీసీఐ నిషేధం తనలో కసిని పెంచిందని, దాంతో ఇకపై తన కోసం, రికార్డుల కోసమే ఆడాలని నిర్ణయించుకున్నట్లు కేఎల్ రాహుల్ తెలిపాడు. ఒక జాతీయ మీడియా సంస్థతో రాహుల్ పలు విషయాలు పంచుకున్నాడు. బీసీసీఐ నిషేధంతో తనలో స్వార్థం పెరిగిపోయిందన్నాడు. అయితే, తాను వ్యక్తిగత స్వార్థంతో ఆడిన మ్యాచుల్లో విఫలమయ్యానని, ఆతర్వాత తన ఆలోచనా విధానం మార్చుకోవడంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్లు రాహుల్ తెలిపాడు. ‘నేను కెరీర్‌లో ఎక్కువ కాలం కొనసాగలేనని తెలుసు. అందుకే మరింతకాలం కొనసాగాలంటే జట్టులో కీలక సభ్యుడిగా మారాలని గ్రహించాను. అప్పటి నుంచి జట్టు కోసం ఆడటం మొదలుపెట్టాను. అది ఒత్తిడిని దూరం చేసిందని’ చెప్పుకొచ్చాడు. తనకు అనేక సమయాల్లో రోహిత్ శర్మ అండగా నిలిచినట్లు తెలిపాడు. ‘సచిన్ లాంటి దిగ్గజ క్రీడాకారుడిని యువ క్రికెటర్లు చూసినప్పుడు ఎలాంటి సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడో నాకు రోహిత్ శర్మను చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అతనితో కలసి చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. నాకు అతను ఎన్నోసార్లు అండగా నిలిచాడు’ అని రాహుల్ చెప్పాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. నాలుగో స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని ఈ కర్ణాటక బ్యాట్స్‌మాన్ స్పష్టం చేశాడు.