కేఎల్ రాహుల్‌కు సర్జరీ.. ఐపీఎల్‌కు దూరం?

దిశ, స్పోర్ట్స్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రమైన కడుపు నొప్పితో శనివారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. హోటల్ రూమ్‌లో అతడు తీవ్రమైన నొప్పితో బాదపడుతుండగా మెడికల్ బృందాలు ప్రాథమిక వైద్యం అందించాయి. అయినా నొప్పి తీవ్రం కావడంతో అతడిని అత్యవసర గదికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి ‘అక్యూట్ అప్పెండీసైటీస్’ గా నిర్దారించారు. కేవలం సర్జరీ ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉండటంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ […]

Update: 2021-05-02 08:37 GMT

దిశ, స్పోర్ట్స్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రమైన కడుపు నొప్పితో శనివారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. హోటల్ రూమ్‌లో అతడు తీవ్రమైన నొప్పితో బాదపడుతుండగా మెడికల్ బృందాలు ప్రాథమిక వైద్యం అందించాయి. అయినా నొప్పి తీవ్రం కావడంతో అతడిని అత్యవసర గదికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి ‘అక్యూట్ అప్పెండీసైటీస్’ గా నిర్దారించారు. కేవలం సర్జరీ ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉండటంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్‌ ద్వారా వివరాలు వెల్లడించింది. ‘కేఎల్ రాహుల్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థిస్తున్నాము’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నది. కేఎల్ రాహుల్‌కు సర్జరీ నిర్వహిస్తుండటంతో కొన్ని రోజుల విశ్రాంతి అవసరం. దీంతో అతడు మిగతా ఐపీఎల్ సీజన్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నది.

Tags:    

Similar News