పూర్తి ఫిట్‌నెస్‌తో కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గాయంతో ఇండియాకు తిరిగి వచ్చి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో కోలుకున్నాడు. అక్కడ ఫిజియోల సమక్షంలో తిరిగి ఫిట్‌నెస్ సాధించి ఇటీవలే టీమ్ ఇండియాతో కలిశాడు. ప్రస్తుతం చెన్నైలో టెస్టు జట్టుతో బయోబబుల్‌లో ఉన్న కేఎల్ రాహుల్ జట్టుతో కలవడంపై ట్వీట్ చేశాడు. ‘బెంగళూరులోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో తిరిగి ఫిట్‌నెస్ సాధించడం సంతోషంగా ఉన్నది. […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గాయంతో ఇండియాకు తిరిగి వచ్చి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో కోలుకున్నాడు. అక్కడ ఫిజియోల సమక్షంలో తిరిగి ఫిట్‌నెస్ సాధించి ఇటీవలే టీమ్ ఇండియాతో కలిశాడు. ప్రస్తుతం చెన్నైలో టెస్టు జట్టుతో బయోబబుల్‌లో ఉన్న కేఎల్ రాహుల్ జట్టుతో కలవడంపై ట్వీట్ చేశాడు.
‘బెంగళూరులోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో తిరిగి ఫిట్‌నెస్ సాధించడం సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాను. ఇదొక మంచి అనుభూతి’ అని కేఎల్ రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో తలపడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఇండియా తరఫున ఆడటం తనకు గర్వకారణమని రాహుల్ అంటున్నాడు. కాగా, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికైన రాహుల్ అక్కడ నెట్స్‌లో సాధన చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో మ్యాచ్‌లు ఆడకుండానే ఇండియాకు తిరిగి వచ్చేశాడు.