దినేశ్ కార్తీక్‌ను వద్దంటున్న ఫ్యాన్స్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శనకు కెప్టెన్ దినేశ్ కార్తీక్ కారణమంటూ పలు విమర్శలు వస్తున్నాయి. జట్టులో హేమాహేమీలైన క్రికెటర్లు ఉన్నప్పటికీ సరైన కూర్పు ఉండట్లేదు. దినేశ్ కార్తీక్ బ్యాట్స్‌మాన్‌గా పరుగులు చేయకపోగా కెప్టెన్‌గానూ ఘోరంగా విఫలమవుతున్నాడు. వెంటనే అతడిని కెప్టెన్‌గా తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో ఢిల్లీ నిర్థేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించడానికి చివర్లో ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి తీవ్ర ప్రయత్నం […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శనకు కెప్టెన్ దినేశ్ కార్తీక్ కారణమంటూ పలు విమర్శలు వస్తున్నాయి. జట్టులో హేమాహేమీలైన క్రికెటర్లు ఉన్నప్పటికీ సరైన కూర్పు ఉండట్లేదు. దినేశ్ కార్తీక్ బ్యాట్స్‌మాన్‌గా పరుగులు చేయకపోగా కెప్టెన్‌గానూ ఘోరంగా విఫలమవుతున్నాడు. వెంటనే అతడిని కెప్టెన్‌గా తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
గత మ్యాచ్‌లో ఢిల్లీ నిర్థేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించడానికి చివర్లో ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ 18 పరుగుల దూరంలోనే నిలిచిపోయారు. రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాడిని ఓపెనర్‌గా పంపకుండా దినేశ్ తప్పు చేశాడని అంటున్నారు. సునిల్ నరైన్‌ను ఎందుకు ఓపెనర్‌గా ఆడిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దినేశ్ బదులు ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయాన్ని తన యూట్యూబ్ చానల్‌లో వెల్లడించాడు. జట్టును గంభీర్ లాగా నడిపించే కెప్టెన్ కావాల్సిన అవసరం ఉందని చెప్పాడు.