వైద్యుల పర్యవేక్షణలో కివీస్ పేసర్
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తీవ్ర గొంతు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతన్ని మ్యాచ్ అనంతరం ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫెర్గూసన్‌ను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కివీస్ జట్టు ప్రతినిధి తెలిపారు. అతడి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని, రిపోర్డు వచ్చాక అతని కొనసాగించాల వద్దా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సిడ్నీ వన్డేకు […]
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తీవ్ర గొంతు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతన్ని మ్యాచ్ అనంతరం ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫెర్గూసన్‌ను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కివీస్ జట్టు ప్రతినిధి తెలిపారు. అతడి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని, రిపోర్డు వచ్చాక అతని కొనసాగించాల వద్దా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సిడ్నీ వన్డేకు ప్రేక్షకులను అనుమతించలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆసీస్-కివీస్ మధ్య వన్డే సిరీస్ రద్దు అయినట్లు తెలుస్తోంది.
tag;new zealand bowler, Lockie Ferguson, throat infection, cricket