టీమ్ ఇండియా గెలుపును కించపరిచిన కివీస్ క్రికెటర్
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ క్రికెటర్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు అందరికీ ఇష్టం. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే కాకుండా.. జెంటిల్‌మెన్ గేమ్‌కు నిజమైన నిర్వచనంలో ఉంటారు. అయితే ఇటీవల ఒకరిద్దరు కివీస్ ప్లేయర్లు మాటలు జారుతున్నారు. జిమ్మీ నీషమ్ ఇటీవల టీమ్ ఇండియా గెలుపులను తక్కువ చేసి మాట్లాడాడు. అది మరువక ముందే మరో కివీస్ క్రికెటర్ భారత జట్టు విజయాన్ని కించ పరుస్తూ కామెంట్ చేశాడు. న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా […]
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ క్రికెటర్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు అందరికీ ఇష్టం. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే కాకుండా.. జెంటిల్‌మెన్ గేమ్‌కు నిజమైన నిర్వచనంలో ఉంటారు. అయితే ఇటీవల ఒకరిద్దరు కివీస్ ప్లేయర్లు మాటలు జారుతున్నారు. జిమ్మీ నీషమ్ ఇటీవల టీమ్ ఇండియా గెలుపులను తక్కువ చేసి మాట్లాడాడు. అది మరువక ముందే మరో కివీస్ క్రికెటర్ భారత జట్టు విజయాన్ని కించ పరుస్తూ కామెంట్ చేశాడు. న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో టెయిలెండర్లు పోరాడటంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే రెండో టెస్టులో అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసినా.. బ్యాటర్లు విఫలం అవడంతో భారత జట్టు 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీనిపై స్పందించిన కివీస్ ఆటగాడు మెక్‌క్లిగన్ వ్యంగ్యంగా పోస్టు పెట్టాడు.
‘ఐసీసీ టెస్టు చాంపియన్ అయిన కివీస్‌ను భారత జట్టు వారి దేశంలోనే వారికి అనుకూలమైన పరిస్థితుల మధ్య ఓడించింది. ఇందుకు టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉండి ఉంటుంది. కంగ్రాట్స్’ అంటూ పోస్టు పెట్టాడు. దీనిపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ దేశం అయినా వారి స్వదేశంలో గెలుస్తూనే ఉంటారు. ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో గెలిచిన విషయం మరిచిపోయావా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను కవర్ చేస్తూ మెక్‌క్లిగన్ తాను జోక్ చేశానని అన్నాడు. అయినా సరే ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం చల్లారలేదు.