కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ.. ఏమన్నారంటే !

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచనలను అమలు చేయాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి సర్వేలు నిర్వహించి రోగులను గుర్తించాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని, వయోవృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తొలిదశలోనే వైద్యసేవలు అందించాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ […]

Update: 2020-06-09 06:22 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచనలను అమలు చేయాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి సర్వేలు నిర్వహించి రోగులను గుర్తించాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని, వయోవృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తొలిదశలోనే వైద్యసేవలు అందించాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ తరహా అనారోగ్య సమస్యలున్న రోగులను గుర్తించాడానికి స్థానికంగా ఉన్న అన్ని ఆస్పత్రులను ఉపయోగించుకోవాలని, ఇంటింటి సర్వే బృందాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కరోనా వచ్చిన గృహాలను రెగ్యులర్‌గా యంత్రాల ద్వారా శానిటైజ్ చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో వారియర్స్‌గా పనిచేస్తున్న సిబ్బంది రక్షణకు తగు చర్యలు తీసుకుంటూ వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించాలని లేఖలో స్పష్టం చేశారు.

Tags:    

Similar News