బీసీల జాబితాపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే: కిషన్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని, అయితే బీసీల జాబితాపై నిర్ణయం తీసుకోవల్సిన అధికారం రాష్ట్రాలపైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. నేషనల్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఆదివారం ఓబీసీ రిజర్వేషన్లపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్​తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలన్న బీసీ సంఘాల డిమాండ్‌ ను గౌరవవించిన […]

Update: 2021-09-26 07:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని, అయితే బీసీల జాబితాపై నిర్ణయం తీసుకోవల్సిన అధికారం రాష్ట్రాలపైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. నేషనల్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఆదివారం ఓబీసీ రిజర్వేషన్లపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్​తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలన్న బీసీ సంఘాల డిమాండ్‌ ను గౌరవవించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని పేర్కొన్నారు. 27 మంది బీసీలకు కేబినెట్ లో స్థానం కల్పించిన గొప్ప నేత మోడీ అని కొనియాడారు. బడుగు గబలహీన వర్గాలకోసం మోడీ ప్రభుత్వం టాయిలెట్స్ కట్టించిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్య ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 27 శాతం రిజిస్ట్రేషన్లు అమలుచేయాలని తెలిపారు. బర్లు, గొర్లు, చేప పిల్లలు పంపిణీ చేస్తే బీసీల సంక్షేమం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందని కొనియాడారు. ఎయిమ్స్ కళాశాలలో బీసీ విద్యార్ధులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీదని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం పార్టీలకతీతంగా నాయకులంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. బీసీ కుల గణన చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలు బానిసలు కాదని, రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కు అని తెలిపారు. యూనివర్సిటీల్లో‌ ఖాళీగా ఉన్న బీసీ ప్రొఫెసర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలు ఆపదలో ఉంటే అందరికీ అండగా జాతీయ బీసీ కమిషన్​సభ్యుడు తల్లోజు ఆచారీ ఆపద్భాందవుడిగా మారారన్నారు. ఈ సమావేశంలో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ భగవన్ లాల్ సహాని, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News