కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం

దిశ, న్యూస్​బ్యూరో: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రత్యేక పోస్టల్ స్టాంప్​ను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తపాల బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ను కోరడంపై సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీవీ […]

Update: 2020-07-02 10:37 GMT

దిశ, న్యూస్​బ్యూరో: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రత్యేక పోస్టల్ స్టాంప్​ను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తపాల బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ను కోరడంపై సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీవీ దూరదృష్టితో సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం పీవీ పోస్టల్ స్టాంప్​ను విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News