Kisan Vikas Patra : రూ. 5లక్షల పెట్టుబడితో 10 లక్షల ఆదాయం..

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బు ఎవరికీ అవసరం ఉండదూ.. ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించడానికే కష్టపడుతూ ఉంటారు. కొందరు సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవడానికి వడ్డీకి ఇవ్వడం లేకపోతే చిట్టీలు వేయడం చేస్తారు. అయితే ప్రభుత్వం అందించే వివిధ పథకాల్లో డబ్బులు జమ చేస్తే మంచి ఆదాయంతో మన డబ్బులను తక్కువ సమయంలోనే రెట్టింపు చేసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా.. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది. అందులో పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి ప్రత్యేకంగా […]

Update: 2021-11-26 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బు ఎవరికీ అవసరం ఉండదూ.. ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించడానికే కష్టపడుతూ ఉంటారు. కొందరు సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవడానికి వడ్డీకి ఇవ్వడం లేకపోతే చిట్టీలు వేయడం చేస్తారు. అయితే ప్రభుత్వం అందించే వివిధ పథకాల్లో డబ్బులు జమ చేస్తే మంచి ఆదాయంతో మన డబ్బులను తక్కువ సమయంలోనే రెట్టింపు చేసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా.. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది. అందులో పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోస్టాఫీస్‌కు సంబంధిచిన పథకాలలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పథకం ద్వారా ప్రజలు అధిక ఆదాయం పొందవచ్చు. మనం ఈ పథకంలో ఎంత డబ్బులు పెట్టుబడిగా పెడుతామో అంతకన్న రెట్టింపు ఆదాయాన్ని పొందవచ్చు. కొంత మందికి భయం ఉంటుంది ఇందులో పెట్టుబడి పెడితే ఎదైనా సమస్య వస్తుందో అని కానీ ఎలాంటి రిస్క్ లేకుండా మనం పెట్టిన పెట్టుబడి భద్రంగా ఉండటమే కాకుండా మనకు పెట్టుబడిపై మంచి రాబడి కూడా వస్తుంది అంటున్నారు అధికారులు.

ఈ పథకంకు సంబంధించిన వివరాలు..

పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు

ఈ పథకంలో డబ్బులు పెట్టడానికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఈ పథకంలో మనం పెట్టిన పెట్టుబడిపై ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. 124 నెలల్లో ఈ డబ్బు రెట్టింపు అవుతుంది

అంటే మనం 5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే, 124 నెలల్లో ఏకంగా 10 లక్షల రూపాయలు అవుతుంది.

Tags:    

Similar News