‘వ్యాక్సిన్ తయారీకి తొందపడకూడదు’

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్ తయారీలో తొందపడకూడదని బయోకాన్ ఛైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందా షా అభిప్రాయపడ్డారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపేయడంతో వ్యాక్సిన్‌ను త్వరితగతిన అభివృద్ధి చేయలేమని తేలినట్టు మజుందా షా తెలిపారు. సురక్షితమైన, అవసరమైనంత సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్ 2021 మార్చి లేదంటే ఏప్రిల్‌లోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయని చెప్పారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యలు ఉత్పన్నమవడంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా […]

Update: 2020-09-10 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్ తయారీలో తొందపడకూడదని బయోకాన్ ఛైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందా షా అభిప్రాయపడ్డారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపేయడంతో వ్యాక్సిన్‌ను త్వరితగతిన అభివృద్ధి చేయలేమని తేలినట్టు మజుందా షా తెలిపారు. సురక్షితమైన, అవసరమైనంత సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్ 2021 మార్చి లేదంటే ఏప్రిల్‌లోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయని చెప్పారు.

క్లినికల్ పరీక్షల్లో సమస్యలు ఉత్పన్నమవడంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ బ్రిటన్, భారత్ సహా పలు దేశాల్లో నిలిపేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌కు సంబంధించిన పరీక్షలు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ అంశంపైనే చర్చిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందన్నారు.

ఎందుకంటే, ఈ పరీక్షలు ఆరోగ్యకరమైన వ్యక్తులపై పరీక్షిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మజూందార్ షా చెప్పారు. కాగా, ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అనుకోని అవాంతరాల కారణంగా డీసీజీఐ ఆదేశాలను అనుసరించి తాత్కాలికంగా ఆపేసినట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ గురువారం ప్రకటించింది.

Tags:    

Similar News