కత్తులతో బెదిరించి యువకుడి కిడ్నాప్
దిశ, వెబ్‌డెస్క్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడి కిడ్నాప్ చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్‌కు చెందిన షేక్ రహీం కూకట్‌పల్లిలోని ఐసీసీఎస్ అనే కాల్‌సెంటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో ఉన్న నలుగురు వ్యక్తులు రహీంను కొట్టి కిడ్నాప్ చేశారు. అనంతరం రహీం తల్లి రేష్మకు ఫోన్ చేసి […]
దిశ, వెబ్‌డెస్క్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడి కిడ్నాప్ చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్‌కు చెందిన షేక్ రహీం కూకట్‌పల్లిలోని ఐసీసీఎస్ అనే కాల్‌సెంటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో ఉన్న నలుగురు వ్యక్తులు రహీంను కొట్టి కిడ్నాప్ చేశారు. అనంతరం రహీం తల్లి రేష్మకు ఫోన్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని, వెంటనే రూ. 3లక్షలు పంపాలని డిమాండ్ చేశారు.
రహీంను గాయపర్చిన, గొంతుపై కత్తిపెట్టి ఉన్న ఫొటోలను ఆమెకు వాట్సాప్‌లో పంపారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి కాల్ చేసి రూ.50 వేలు పంపితే రహీంను విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో రహీం తల్లిదండ్రులు ఫోన్ పే ద్వారా రూ.10 వేలు పంపారు. రహీం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితుడిని రక్షించి కిడ్నాపర్లలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నగదు లావాదేవీల విషయంలో తెలిసిన వ్యక్తులే రహీంను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.