మిస్సింగ్ కేసు.. ఇరికించబోయి.. ఇరుకున్నారు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూమి క్రయవిక్రయాల్లో వచ్చిన పొరపొచ్చాలను మనసులో పెట్టుకుని కిడ్నాప్ డ్రామా ఆడిన ఇద్దరు వ్యక్తుల గుట్టు రట్టు చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథని అటవీ ప్రాంతంలో శనివారం ఇద్దరు వ్యక్తుల అదృశ్యం కేసులో మిస్టరీ వీడిపోయింది. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్నాపూర్, రాజాపూర్‌‌‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలే హై డ్రామా నడిపించారని పోలీసుల విచారణలో తేలింది. వీరు ఇటీవల భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సమీపంలో […]

Update: 2021-04-20 02:51 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూమి క్రయవిక్రయాల్లో వచ్చిన పొరపొచ్చాలను మనసులో పెట్టుకుని కిడ్నాప్ డ్రామా ఆడిన ఇద్దరు వ్యక్తుల గుట్టు రట్టు చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథని అటవీ ప్రాంతంలో శనివారం ఇద్దరు వ్యక్తుల అదృశ్యం కేసులో మిస్టరీ వీడిపోయింది. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్నాపూర్, రాజాపూర్‌‌‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలే హై డ్రామా నడిపించారని పోలీసుల విచారణలో తేలింది. వీరు ఇటీవల భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సమీపంలో వ్యవసాయ భూమి కొనేందుకు బేరం కుదుర్చుకున్నారు.

అయితే గంగారాం గ్రామానికి చెందిన భూమి యజమాని బిల్ ఉన్నిసా బేగం లావాదేవీల్లో ఇబ్బందులు పెడుతుందని, ఈ కారణంగా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నారని పెద్దపల్లి డీసీపీ రవీందర్ వివరించారు. ముత్తా తమను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు రాజేశం, మల్లయ్య లపై కేస్ నమోదు చేసినట్టు డీసీపీ రవిందర్ తెలిపారు.

Tags:    

Similar News