ఖానాపూర్ ఎస్సై హఠాన్మరణం.. ఏమైందీ ?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జన్నారపు నారాయణ హఠాన్మరణం చెందారు. గత నాలుగు రోజులుగా దగ్గుతో బాధపడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పరీక్షలు చేయించుకున్నారు. కాగా అక్కడి వైద్యులు ఆయనను హైదరాబాద్ కు రిఫర్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఊపిరి ఆడక మృతి చెందారు. హైదరాబాదు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణకు భార్య, […]

Update: 2020-08-16 22:06 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జన్నారపు నారాయణ హఠాన్మరణం చెందారు. గత నాలుగు రోజులుగా దగ్గుతో బాధపడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పరీక్షలు చేయించుకున్నారు.

కాగా అక్కడి వైద్యులు ఆయనను హైదరాబాద్ కు రిఫర్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఊపిరి ఆడక మృతి చెందారు. హైదరాబాదు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన స్వస్థలం ఖానాపూరే కావడం గమనార్హం. ఎస్సై మృతి పట్ల జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విష్ణు వారియర్, అదనపు ఎస్పీ రాంరెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News