కరోనా కాటుకు ఖానాపూర్ ఏడిఏ మృతి

దిశ ఖానాపూర్: రోజు రోజుకు భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి వ్యాధితో ఎప్పుడు ఏ వార్త వింటామో అని ప్రజలో ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ శాఖ డివిషన్ లో ఏడిఏ గా విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీం హనీఫ్ కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో ముధోల్ లో వ్యవసాయ శాఖ […]

Update: 2021-04-26 00:08 GMT

దిశ ఖానాపూర్: రోజు రోజుకు భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి వ్యాధితో ఎప్పుడు ఏ వార్త వింటామో అని ప్రజలో ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ శాఖ డివిషన్ లో ఏడిఏ గా విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీం హనీఫ్ కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో ముధోల్ లో వ్యవసాయ శాఖ అధికారిగా వున్నారు. ఆయనకు ఖానాపూర్, కడం,పెంబి, దస్తురాబాద్ మండల వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

అంతే కాక ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి గ్రామంలో ని కందుల శాంతా (40) కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గత రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కాని అక్కడ ఆక్సిజన్ వెంటిలేటర్స్ లేకపోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు పంపమని డాక్టర్ లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో, దాతల సాయంతో ఆదిలాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కరోనా మృత్తి చెందింది.

Tags:    

Similar News