2020-21లో 16 శాతం తగ్గిన ఖాదీ అమ్మకాలు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నేత కార్యకలాపాలు దెబ్బ తినడంతో ఖాదీ అమ్మకాలు 16 శాతం క్షీణించి రూ. 3,527.71 కోట్లకు చేరుకున్నాయని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఖాదీ రంగంలో మొత్తం ఉత్పత్తి 2020-21లో రూ. 1,904.49 కోట్లకు తగ్గింది. 2019-20లో ఉత్పత్తి విలువ రూ. 2,292.44 కోట్లుగా నమోదైంది. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఖాదీ ఉత్పత్తి యూనిట్లు, అమ్మకాల దుకాణాలు మూసేయబడ్డాయి. దీంతో ఉత్పత్తి, […]

Update: 2021-06-17 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నేత కార్యకలాపాలు దెబ్బ తినడంతో ఖాదీ అమ్మకాలు 16 శాతం క్షీణించి రూ. 3,527.71 కోట్లకు చేరుకున్నాయని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఖాదీ రంగంలో మొత్తం ఉత్పత్తి 2020-21లో రూ. 1,904.49 కోట్లకు తగ్గింది. 2019-20లో ఉత్పత్తి విలువ రూ. 2,292.44 కోట్లుగా నమోదైంది. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఖాదీ ఉత్పత్తి యూనిట్లు, అమ్మకాల దుకాణాలు మూసేయబడ్డాయి. దీంతో ఉత్పత్తి, అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News