కేజీఎఫ్ ఫ్రాంచైజ్.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ మరో ఫిల్మ్ అనౌన్స్ చేశారు. 15 రోజుల క్రితమే ప్రభాస్ ‘సలార్’ మూవీ ప్రకటించిన హోంబలె ఫిల్మ్స్, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌‌ను ప్రకటించింది. ఈ సినిమాలో రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా నటించనుండగా.. ‘భగీరా’ టైటిల్ ఫైనల్ చేశారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించనున్న సినిమాకు ‘సలార్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందిస్తుండటం విశేషం. ‘సమాజం అడవిగా మారినప్పుడు.. ఒక ప్రెడేటర్ న్యాయం కోసం గర్జిస్తుంది’ అనే […]

Update: 2020-12-17 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ మరో ఫిల్మ్ అనౌన్స్ చేశారు. 15 రోజుల క్రితమే ప్రభాస్ ‘సలార్’ మూవీ ప్రకటించిన హోంబలె ఫిల్మ్స్, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌‌ను ప్రకటించింది. ఈ సినిమాలో రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా నటించనుండగా.. ‘భగీరా’ టైటిల్ ఫైనల్ చేశారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించనున్న సినిమాకు ‘సలార్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందిస్తుండటం విశేషం. ‘సమాజం అడవిగా మారినప్పుడు.. ఒక ప్రెడేటర్ న్యాయం కోసం గర్జిస్తుంది’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ యూనిట్.. హీరో శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా రోరింగ్ స్టార్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా.. ఆయన లుక్ చాలా ఇంటెన్స్‌, థ్రిల్లింగ్‌గా ఉంది.

Tags:    

Similar News