కేజీఎఫ్ ప్రసారం చేసిన తెలుగు చానల్ పై కేసు వేస్తాం : కేజీఎఫ్ నిర్మాత
యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’.. దేశవ్యాప్తంగా అఖండ విజయం అందుకుంది. ఈ ఒక్క సినిమాతో యశ్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్బాస్టర్ విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత హైదరాబాద్ లో వేసిన సెట్ లో కేజీఎఫ్ -2 షూటింగ్ జరగనుంది. ఇందులో రవీనా […]
యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’.. దేశవ్యాప్తంగా అఖండ విజయం అందుకుంది. ఈ ఒక్క సినిమాతో యశ్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్బాస్టర్ విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత హైదరాబాద్ లో వేసిన సెట్ లో కేజీఎఫ్ -2 షూటింగ్ జరగనుంది. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిజిటల్హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులపై ఓ చానెల్ తో చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో కేజీఎఫ్ సినిమాను ఓ తెలుగు లోకల్ చానెల్ అక్రమంగా ప్రసారం చేసింది. దీనిపై కేజీఎఫ్ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, సదరు చానెల్ పై కేసు వేస్తామని ట్వీట్ చేశారు. ఓ వైపు శాటిలైట్ డీల్స్ దాదాపు ఫైనల్ అవుతున్న సమయంలో కేబుల్ ఛానెల్ చిత్రాన్ని ప్రసారం చేయడం ఇల్లీగల్ అని, తమ దగ్గర ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని నిర్మాత కార్తిక్ గౌడ తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు. ఇక రెండో పార్ట్ ‘కేజీఎఫ్ 2’ కు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం.