విజిల్ వేస్తే పలికే తాళాలు

వెబ్ డెస్క్ : విజిల్ వేస్తే తాళాలు పలకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి, వీటిని అలా తయారుచేయడానికి కూడా పెద్ద కారణమే ఉంది. మనకు అత్యవసరమైనవి, ఇంట్లో ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోయే వాటిలో తాళాలే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. బయటకి వెళ్దామని బయలుదేరే సమయానికి అవి ఎక్కడో ఉండి పోయి హడావిడి పెట్టేస్తాయి. సెల్ ఫోన్ కి రింగ్ ఇస్తే ఎక్కడుందో తెలిసి పోయినట్టు… ఈ తాళాలు కూడా అలానే దొరికితే ఎంతో బాగుంటుందని చాలా మంది అనుకుంటూ […]

Update: 2020-10-04 04:46 GMT

వెబ్ డెస్క్ : విజిల్ వేస్తే తాళాలు పలకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి, వీటిని అలా తయారుచేయడానికి కూడా పెద్ద కారణమే ఉంది. మనకు అత్యవసరమైనవి, ఇంట్లో ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోయే వాటిలో తాళాలే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి.

బయటకి వెళ్దామని బయలుదేరే సమయానికి అవి ఎక్కడో ఉండి పోయి హడావిడి పెట్టేస్తాయి. సెల్ ఫోన్ కి రింగ్ ఇస్తే ఎక్కడుందో తెలిసి పోయినట్టు… ఈ తాళాలు కూడా అలానే దొరికితే ఎంతో బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తాళాలు ఎక్కడ ఉన్నాయో చిటికెలో తెలుసుకునేందుకు తయారుచేసిందే ఈ “కీ ఫైండర్”.

మామూలు కీచెయిన్ లాగే దీనికి కూడా తాళంచేతులు పెట్టుకోవచ్చు. అయితే ఇందులో ఉండే సెన్సార్ ల వల్ల మనం విజిల్ వేసినా, చప్పట్లు కొట్టినా అది వెలుగుతూ శబ్దం చేస్తుంది. అందుకే చీకట్లో ఉన్న తాళాలను సైతం చిటికెలో పసిగట్టవచ్చు. దాదాపు ముప్పై అడుగుల దూరంలో ఉన్న వాటిని కూడా మనం ఇలాగే కనిపెట్టవచ్చు. ఇది ఉంటే తాళాలు వెతికే ఇబ్బందే లేకుండా ఈజీగా కనిపెట్టవచ్చు కదా!!

ప్రస్తుతం ఇవి అమెజాన్ (amazon), ఫ్లిప్ కార్ట్ (flipkart), ఆర్డర్ టు ఇండియా (order2india), విష్(wish), యు బయ్ ఇండియా (ubuy india), ఇంకా అనేక ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి. ధర వాటి సైజుల్ని బట్టి, తయారు చేసిన మెటీరియల్, నాణ్యతను బట్టి రకరకాలుగా ఉన్నాయి. స్టార్టింగ్ 100/- నుండి వేలల్లో ఉంది.

Tags:    

Similar News