మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులు బంద్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటల పాటు ఈ సమావేశం జరగ్గా..  పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, మధ్యాహ్నం కర్ఫ్యూ,  కరోనా వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్ కొరతకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లో భాగంగా 12 తర్వాత ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కొరతకు సంబంధించి ప్రధాని […]

Update: 2021-05-04 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటల పాటు ఈ సమావేశం జరగ్గా.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, మధ్యాహ్నం కర్ఫ్యూ, కరోనా వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్ కొరతకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లో భాగంగా 12 తర్వాత ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కొరతకు సంబంధించి ప్రధాని మోదీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాయనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి తొలుత వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు

-రైతుల ఖాతాల్లో మే 13న రైతు భరోసా నగదు జమ

-మే 25న పంట నష్టపరిహారం నగదు జమ

-మే 18న వైఎస్సార్ మత్స్యకార పథకం నగదు జమ

-7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఆమోదం

-అర్బకుల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు

-ఇమామ్‌ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు

-మౌజమ్‌ల గౌరవం వేతనం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు

-176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

Tags:    

Similar News