జీవీఎల్‌ని కట్టడి చేయండి.. మౌనం తగదు: కేశినేని

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం తగదని టీడీపీ ఎంపీ కేశినేని నాని సూచించారు. విజయవాడలోని ఆటోనగర్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారని, అది సరికాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కేంద్రానికి కూడా ఉందని ఆయన తెలిపారు. జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. రాజధానిపై […]

Update: 2020-02-26 03:33 GMT

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం తగదని టీడీపీ ఎంపీ కేశినేని నాని సూచించారు. విజయవాడలోని ఆటోనగర్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారని, అది సరికాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కేంద్రానికి కూడా ఉందని ఆయన తెలిపారు.

జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని ఆయన సూచించారు. 3 రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని ఆయన సూచించారు. అమరావతి సమస్య జాతీయ సమస్యగా పరిణమించకముందే కేంద్రం జోక్యం చేసుకోవాని ఆయన పిలుపునిచ్చారు. కేసుల పేరిట వేధిస్తున్నారని, పోలీసులపైకి నెపం నెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News