కీసర మాజీ తహసీల్దార్ ఆత్మహత్య..
దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. కోటి 10లక్షలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో ఎన్‌వోసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎమ్మార్వోను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో నిందితుడిని పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఇవాళ జైలులోనే ఆత్మహత్య […]
దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. కోటి 10లక్షలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో ఎన్‌వోసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎమ్మార్వోను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం నెల రోజుల వ్యవధిలో నిందితుడిని పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఇవాళ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.