భారత్‌కు చేరిన సౌమ్య సంతోష్ మృతదేహం
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర దాడుల్లో భారత మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ రాకెట్ దాడిలో మరణించింది. ఇజ్రాయిల్‌లోని అష్కెలోన్ నగరంలో హెల్పర్‌గా పని చేస్తున్న సౌమ్య అదే నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. దాడులు జరుగుతున్న సమయంలో ఇంట్లోనే ఉన్న సౌమ్య భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే రాకెట్ పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలోనే శనివారం […]
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర దాడుల్లో భారత మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ రాకెట్ దాడిలో మరణించింది. ఇజ్రాయిల్‌లోని అష్కెలోన్ నగరంలో హెల్పర్‌గా పని చేస్తున్న సౌమ్య అదే నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. దాడులు జరుగుతున్న సమయంలో ఇంట్లోనే ఉన్న సౌమ్య భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే రాకెట్ పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఇజ్రాయిల్ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి వీ. మురళీధరన్, ఇజ్రాయిల్ రాయబారి యెడిడియా క్లెయిన్ సౌమ్య పార్థీవదేహానికి నివాళుల అర్పించారు. అనంతరం మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.