మేకలమ్మి మేలు చేసిన ముసలమ్మ..

దిశ, ఫీచర్స్ : స్పందించే మనసు, సాయం చేసే గుణం ఉండాలే గానీ.. ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో తోడ్పాటు అందించవచ్చు. కటిక దారిద్య్రం అనుభవిస్తూ కూడా సాటివారి కన్నీళ్లు తుడవచ్చు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ తాహతుకు మించిన సాయంతో మానవత్వాన్ని చాటుకోగా.. తాజగా కేరళకు చెందిన 61 ఏళ్ల మహిళ.. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేకలు అమ్మి ‘చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్‌ఎఫ్)కు విరాళమిచ్చింది. కొవిడ్‌పై […]

Update: 2021-05-20 08:04 GMT

దిశ, ఫీచర్స్ : స్పందించే మనసు, సాయం చేసే గుణం ఉండాలే గానీ.. ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో తోడ్పాటు అందించవచ్చు. కటిక దారిద్య్రం అనుభవిస్తూ కూడా సాటివారి కన్నీళ్లు తుడవచ్చు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ తాహతుకు మించిన సాయంతో మానవత్వాన్ని చాటుకోగా.. తాజగా కేరళకు చెందిన 61 ఏళ్ల మహిళ.. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేకలు అమ్మి ‘చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్‌ఎఫ్)కు విరాళమిచ్చింది. కొవిడ్‌పై పోరులో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తన వంతు మద్దతు తెలియజేసింది.

కేరళలోని కొల్లాం సిటీలో టీస్టా్ల్ నడుపుకునే సుబైదా(61).. మరోవైపు మేకలు పెంచుకుంటూ కష్టాల నడుమ జీవితాన్ని నెట్టుకొస్తోంది. అయినా సరే కరోనా పాండమిక్ సిచ్యువేషన్‌లో వ్యాక్సిన్లకు క్రౌడ్ సోర్సింగ్‌ నిమిత్తం తన నాలుగు మేకలు అమ్మేసి స్టేట్ రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసింది. ఈ మేరకు సోమవారం తనకు జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి, ఏమైనా ఎన్వలప్ కవర్ అందిందా? అని వాకబు చేశారు. రాలేదని తెలపడంతో ఈ రోజు(గురువారం) జరిగిన లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్టు వెల్లడించారు. అయితే ఒకరోజు తర్వాత సుబైదాకు కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వీవీఐపీ పాస్ అందడంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది.

కాగా టీస్టాల్ నడుపుతూ ముగ్గురిని పోషిస్తున్న సుబైదా.. మిగిలిన ఆర్థిక అవసరాల కోసం 20 మేకలను పెంచుతోంది. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లోనే రెండు మేకలు అమ్మి డొనేట్ చేయగా, ఈ ఏడాది నాలుగు మేకలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని విరాళంగా అందజేయడం విశేషం.

Tags:    

Similar News