పొగ రాని ‘రాకెట్ స్టవ్’
దిశ, వెబ్ డెస్క్: ఎల్‌పీజీ సిలిండర్లు వంటింట్లో వెలగక ముందు, కిరోసిన్ స్టవ్‌లు మార్కెట్‌లోకి ప్రవేశించక ముందు అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక నేచురల్ స్టవ్.. ‘కట్టెల పొయ్యి’. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది ఈ తరహా పొయ్యిలను వాడుతుండగా, ఆ పొగను పీల్చుకోవడం వల్ల సంవత్సరానికి దాదాపు 4 మిలియన్ల మంది చనిపోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాగా ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఎల్‌పీజీ, కిరోసన్ స్టవ్‌లకు దూరమైన వారి కోసం కేరళలోని […]
దిశ, వెబ్ డెస్క్: ఎల్‌పీజీ సిలిండర్లు వంటింట్లో వెలగక ముందు, కిరోసిన్ స్టవ్‌లు మార్కెట్‌లోకి ప్రవేశించక ముందు అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక నేచురల్ స్టవ్.. ‘కట్టెల పొయ్యి’. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది ఈ తరహా పొయ్యిలను వాడుతుండగా, ఆ పొగను పీల్చుకోవడం వల్ల సంవత్సరానికి దాదాపు 4 మిలియన్ల మంది చనిపోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాగా ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఎల్‌పీజీ, కిరోసన్ స్టవ్‌లకు దూరమైన వారి కోసం కేరళలోని త్రిక్కకర ప్రాంతానికి చెందిన అబ్దుల్ కరీం పర్యావరణహిత స్టవ్‌ను రూపొందించాడు. మరి ఆ ‘రాకెట్ స్టవ్’ విశేషాలేంటో తెలుసుకుందాం.
కట్టెల పొయ్యి నుంచి వెలువడే పొగ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిసిందే. అయితే కరీం రూపొందించిన రాకెట్ స్టవ్‌కు కూడా కట్టెలు, కొబ్బరి చిప్పలు, వేస్ట్ పేపర్లతోనే పనిచేస్తుండగా, దాన్నుంచి 20 శాతం కర్బన ఉద్గారాలు మాత్రమే వెలువడుతాయి. ఈ స్టవ్ మీద అన్నిరకాల మట్టి, టెర్రాకోట పాత్రలతో పాటు ఇతర పాత్రలను కూడా ఉపయోగించి వంట చేసుకోవచ్చు. అంతేకాదు పక్కవారికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీటిని అపార్ట్‌మెంట్ బాల్కనీల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఐదు మోడల్స్‌లో తయారైన ఈ రాకెట్ స్టవ్స్‌లోని హై ఎండ్ మోడల్ ధర రూ.14 వేలు ఉండగా, బేసిక్ మోడల్ ధర రూ.4,500/-. ఇక మిగతా మోడల్స్‌లో గ్రిల్లింగ్, ఓవెన్, వాటర్ హీటింగ్ సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం రెండు మోడల్స్ మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, మిగతా మోడల్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాడు.
పరిమిత స్థాయిలోనే ఉత్పత్తి చేసిన ఈ తరహా స్టవ్‌లకు మంచి స్పందన లభిస్తుండగా, త్వరలోనే ఓ పరిశ్రమను స్థాపించి పెద్ద మొత్తంలో వీటిని విక్రయించాలని కరీం భావిస్తున్నాడు. మామూలుగా మోటార్ పంప్‌లు, ఫర్నేస్‌లు, బాయిలర్స్, కిచెన్ సామగ్రిని తయారు చేసి విక్రయించే కరీం.. కరోనా వల్ల వాటికి గిరాకీ లేకపోవడంతో లాక్‌డౌన్‌లో ఈ రాకెట్ స్టవ్‌ను తయారు చేశాడు.