ఫ్రీ కొవిడ్ టెస్ట్ ఫర్ యూఏఈ ప్యాసింజర్స్ @కేరళ

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సాగుతుండగా.. మళ్లీ కరోనా న్యూ స్ట్రెయిన్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికులు తమ కొవిడ్ నెగెటివ్ రిపోర్టును ఎయిర్ సువిధ(Air Suvidha) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, అలా అయితేనే ప్రయాణానికి అర్హులని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్‌లో ఎంట్రీ తర్వాత ప్యాసింజర్స్‌కు చేస్తున్న టెస్టులకు వారే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా […]

Update: 2021-02-28 04:00 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సాగుతుండగా.. మళ్లీ కరోనా న్యూ స్ట్రెయిన్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికులు తమ కొవిడ్ నెగెటివ్ రిపోర్టును ఎయిర్ సువిధ(Air Suvidha) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, అలా అయితేనే ప్రయాణానికి అర్హులని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్‌లో ఎంట్రీ తర్వాత ప్యాసింజర్స్‌కు చేస్తున్న టెస్టులకు వారే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేరళ రాష్ట్రంలోని ఎయిర్‌పోర్ట్స్‌లో మాత్రం యూఏఈ ప్యాసింజర్స్‌కు ఫ్రీగా కొవిడ్ టెస్టు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ ప్రకటించారు.

యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుంచి చాలా మంది నిర్వాసితులు భారత్‌కు వస్తున్నారని, వారి వద్ద కరోనా టెస్టులు చేయించుకునేందుకు కూడా డబ్బులు లేవని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టెస్టులు చేయించి ట్రీట్‌మెంట్ఇవ్వాలని సామాజిక కార్యకర్తలు, పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, ఇండియాలోని పలు ఎయిర్‌పోర్ట్స్‌లో ప్యాసింజర్స్‌కు కొవిడ్ టెస్ట్ చేసేందుకు గాను ప్రైస్ లిస్ట్‌ను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రిలీజ్ చేసింది. అహ్మదాబాద్‌ రూ.800, బెంగళూరు రూ.3,000, ఢిల్లీ రూ.800, చెన్నై రూ.1,200 – 2,500, హైదరాబాద్ రూ.1,000, కోల్‌కతా రూ.950, ముంబై రూ.850 వసూలు చేస్తున్నట్లు లిస్ట్‌లో పేర్కొనగా.. కేరళ ఎయిర్‌పోర్టులో మాత్రం ఫ్రీగా టెస్టులు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం విశేషం.

Tags:    

Similar News