ఎమ్మెల్యే కొడుక్కి కొత్త ఆఫర్.. భారీ ట్విస్ట్ ఇచ్చిన హైకోర్ట్..

దిశ, వెబ్ డెస్క్: ఏదైన అరుదైన ఘటనలో బాధితులు చనిపోతే ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం మామూలే. అప్పుడప్పుడు ఎమ్మెల్యే సంతానానికి కూడా ఇలాగే ఉద్యోగాలు ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనే కేరళా లో జరిగింది. చెంగనూరు ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణిస్తే కేరళ ప్రభుత్వం అతని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇదేంటని రాష్ట్రం మొత్తం వ్యతిరేకత మొదలైంది. విషయం కాస్తా కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ నియామకం చెల్లదని కోర్టు అడ్డంగా […]

Update: 2021-12-03 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏదైన అరుదైన ఘటనలో బాధితులు చనిపోతే ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం మామూలే. అప్పుడప్పుడు ఎమ్మెల్యే సంతానానికి కూడా ఇలాగే ఉద్యోగాలు ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనే కేరళా లో జరిగింది. చెంగనూరు ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణిస్తే కేరళ ప్రభుత్వం అతని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇదేంటని రాష్ట్రం మొత్తం వ్యతిరేకత మొదలైంది. విషయం కాస్తా కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ నియామకం చెల్లదని కోర్టు అడ్డంగా కొట్టేసింది. పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ తీర్పు వెలువరించింది.

ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ ఉద్యోగి కాదు అంటూ చురకలు అంటించింది. ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ కు పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం విమర్శల పాలైంది. అశోక్ కుమార్ అనే సామాజిక కార్యకర్త కోర్ట్ లో కేసు వేశాడు. దీనిపై కేరళ హైకోర్ట్ శుక్రవారం తుది తీర్పు ఇచ్చింది. ప్రజల నుంచి ఎన్నుకున్న నాయకుడు కేవలం 5 సంత్సరాలకు మాత్రమే, అని సీరియస్ అయింది. అంతే కాకుండా ప్రశాంత్ ఉద్యోగం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Tags:    

Similar News