ఎన్ సీ సీలోకి ట్రాన్స్ జెండర్స్.. కేంద్రానికి కీలక ఆదేశాలు
దిశ,వెబ్‌డెస్క్: కేరళ హైకోర్ట్ ట్రాన్స్ జెండర్ హక్కులపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 23 ఏళ్ల ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా తిరువనంతపురం యూనివర్సిటీకి చెందిన కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీ సిబ్బంది త్వరలో ఎన్‌సీసీ క్లాసులు ప్రారంభం కానున్నాయని, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్ధులు త్వరగా ఎన్ సీసీలో జాయిన్ అయ్యేందుకు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో ఎన్ సీసీ లో జాయిన్ అయ్యిందేకు ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా […]
దిశ,వెబ్‌డెస్క్: కేరళ హైకోర్ట్ ట్రాన్స్ జెండర్ హక్కులపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 23 ఏళ్ల ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా తిరువనంతపురం యూనివర్సిటీకి చెందిన కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీ సిబ్బంది త్వరలో ఎన్‌సీసీ క్లాసులు ప్రారంభం కానున్నాయని, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్ధులు త్వరగా ఎన్ సీసీలో జాయిన్ అయ్యేందుకు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
దీంతో ఎన్ సీసీ లో జాయిన్ అయ్యిందేకు ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా ప్రయత్నించింది. కానీ హనీఫాను ఎన్ సీసీలో జాయిన్ చేయించుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఒప్పుకోలేదు. రూల్ ప్రకారం ట్రాన్స్ జెండర్లను ఎన్ సీసీలో తీసులేమని చెప్పడంతో హనీఫా కేరళ హైకోర్ట్ ను ఆశ్రయించింది.
తన 13ఏళ్ల వయస్సులో స్కూల్ డేస్ లో అమ్మాయిగా ఎన్ సీసీలో జాయిన్ అయినట్లు, 2019లో అబ్బాయిగా తనపేరు నమోదు చేసినట్లు పిటిషన్ లో పేర్కొంది. ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత యూనివర్సిటీ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యేందుకు ట్రాన్స్ జెండర్ గా తన పేరును నమోదు చేయించినట్లు హనీఫా తెలిపింది. ఇప్పుడు ఎన్ సీసీలో జాయిన్ అయ్యేందుకు ట్రాన్స్ జెండర్ గా తన పేరు నమోదు చేయించుకుంటే అడ్మిషన్ ఇవ్వడంలేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన కేరళ హైకోర్ట్.., హనీఫాకు ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాత ఎన్ సీసీలోకి తీసుకోవాలని, ఆ ప్రాసెస్ అంతా కోర్ట్ పర్యవేక్షణలో జరిగేలా చూసుకుంటామని న్యాయమూర్తి అను శివరామన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు సెక్షన్- 6 ని పరిగణలోకి తీసుకొని నేషనల్ కేడెట్ కార్ప్స్ యాక్ట్ (1948) ప్రకారం ట్రాన్స్ జెండర్స్ కు సైతం ఎన్‌సీసీలో అవకాశం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు.