వివాదాల్లో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. హైకోర్టులో పిల్ ధాఖలు

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కురప్’ చిత్రం విడుదలైన మొదటిరోజే వివాదాల్లో చిక్కుకుంది. వేఫేరర్ ఫిల్మ్స్‌ ఎమ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూ. 35 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోగా.. ఈ మూవీపై కేరళ‌ హైకోర్టులో పిల్ ధాఖలైంది. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి, సుకుమార కురుప్ అనే నేరస్థుడి గోప్యతను వెల్లడించేలా చిత్రాన్ని తెరకెక్కించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా అతని అప్పీల్‌ను విచారించిన కేరళ హైకోర్టు […]

Update: 2021-11-12 08:47 GMT

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కురప్’ చిత్రం విడుదలైన మొదటిరోజే వివాదాల్లో చిక్కుకుంది. వేఫేరర్ ఫిల్మ్స్‌ ఎమ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూ. 35 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోగా.. ఈ మూవీపై కేరళ‌ హైకోర్టులో పిల్ ధాఖలైంది.

కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి, సుకుమార కురుప్ అనే నేరస్థుడి గోప్యతను వెల్లడించేలా చిత్రాన్ని తెరకెక్కించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా అతని అప్పీల్‌ను విచారించిన కేరళ హైకోర్టు ఈ సినిమాపై స్టే విధించడానికి నిరాకరించింది. కాగా సినిమా నిర్మాత దుల్కర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటర్‌పోల్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News