గవర్నర్​ నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : వరకట్న వేధింపుల కారణంగా ఇటీవల కేరళలో వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నిరాహార దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులను వ్యతిరేకిస్తూ ఆయన నివాసంలోనే బుధవారం ఉదయం నుంచి ఆరిఫ్ నిరాహార దీక్షలో కూర్చున్నారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా వివిధ గాంధేయవాద సంస్థలు ఆయనకు మద్దతుగా దీక్ష చేపట్టాయి. తిరువనంతపురంలోని గాంధీభవన్‌లో ఈ నిరసనలను ప్రారంభించాయి. అయితే, ఈ కార్యక్రమం సాయంత్రం […]

Update: 2021-07-14 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వరకట్న వేధింపుల కారణంగా ఇటీవల కేరళలో వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నిరాహార దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులను వ్యతిరేకిస్తూ ఆయన నివాసంలోనే బుధవారం ఉదయం నుంచి ఆరిఫ్ నిరాహార దీక్షలో కూర్చున్నారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా వివిధ గాంధేయవాద సంస్థలు ఆయనకు మద్దతుగా దీక్ష చేపట్టాయి.

తిరువనంతపురంలోని గాంధీభవన్‌లో ఈ నిరసనలను ప్రారంభించాయి. అయితే, ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇటీవల వరకట్న వేధింపుల కారణంగా పలువురు మహిళలు మృతి చెందటంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరకట్న సంప్రదాయాన్ని రూపుమాపేందుకు తాను స్వచ్ఛందంగా పనిచేసేందుకు సిద్ధమని గవర్నర్​ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం గవర్నర్ దీక్ష చేపట్టారు.

Tags:    

Similar News