కాంటినెంటల్లో ఓనమ్ సంబరాలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కేరళ పండుగ ఓనమ్ ఘనంగా నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్తో పాటు ప్రత్యేకమైన ఓనమ్ సాద్య చేశారు. 20-25 రకాల వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించడం ఈ పండుగ సంప్రదాయం. గతంలో జరిగిన మంచిని తలుచుకోడానికి ఓనమ్ పండుగ జరుపుకుంటామని కాంటినెంటల్ ఆసుపత్రుల చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కుమారి హరితా విజయన్ అన్నారు. ఈ సందర్భంగా తిరువతిర అనే సంప్రదాయ నృత్యం, […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కేరళ పండుగ ఓనమ్ ఘనంగా నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్తో పాటు ప్రత్యేకమైన ఓనమ్ సాద్య చేశారు. 20-25 రకాల వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించడం ఈ పండుగ సంప్రదాయం. గతంలో జరిగిన మంచిని తలుచుకోడానికి ఓనమ్ పండుగ జరుపుకుంటామని కాంటినెంటల్ ఆసుపత్రుల చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కుమారి హరితా విజయన్ అన్నారు. ఈ సందర్భంగా తిరువతిర అనే సంప్రదాయ నృత్యం, ఓనపట్టుకల్ సంగీత ప్రదర్శన నిర్వహించారు. కేరళలో 10 రోజుల పాటు జరిగే ఓనమ్ సంబరాలు ఆగస్టు 22న ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగుస్తాయి.