ఫోన్ కే మూడుముళ్లేసిన పెళ్లి కొడుకు
దిశ, వెబ్ డెస్క్: పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయని పెద్దలు అంటుంటారు. అయితే పెళ్లిల్లు ఎక్కడ నిశ్చయమైన మండపంలోనే కాదు.. ఆన్ లైన్ కూడా చేసుకోవచ్చని ఈ తరం నిరూపిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షల్లో పెళ్లిల్లు ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం.. పెళ్లికి అతిథులు లేకపోతేనేం.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటే చాలనుకుంటూ కల్యాణం కానిచ్చేస్తున్నారు. ఇక మరికొందరు టెక్నాలజీ సాయంతో… ఆన్ లైన్ మ్యారెజ్ కు ఓటేస్తున్నారు. వీడియో కాలింగ్ లో ఒకరినొకరు చూసుకుంటూ.. […]
దిశ, వెబ్ డెస్క్: పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయని పెద్దలు అంటుంటారు. అయితే పెళ్లిల్లు ఎక్కడ నిశ్చయమైన మండపంలోనే కాదు.. ఆన్ లైన్ కూడా చేసుకోవచ్చని ఈ తరం నిరూపిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షల్లో పెళ్లిల్లు ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం.. పెళ్లికి అతిథులు లేకపోతేనేం.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటే చాలనుకుంటూ కల్యాణం కానిచ్చేస్తున్నారు. ఇక మరికొందరు టెక్నాలజీ సాయంతో… ఆన్ లైన్ మ్యారెజ్ కు ఓటేస్తున్నారు. వీడియో కాలింగ్ లో ఒకరినొకరు చూసుకుంటూ.. రింగులు తొడుక్కోవడం ఎంగేజ్ మెంట్లు చేసుకోవడం మనం చాలానే చూశాం. కానీ కరోనా వల్ల.. ఆన్ లైన్ లోనే మూడుముళ్లు వేసి.. పెళ్లి తంతు ముగిస్తున్న కొత్త జంటలను ప్రస్తుతం చూస్తున్నాం. తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఫోన్‌లోనే పెళ్లి చేసుకుంది. ఇలాంటివి ఈమధ్య చాలానే జరిగాయి కానీ… ఈ పెళ్లిలో వరుడు మూడు ముళ్లు ఫోన్ కు వేయడమే ఇక్కడ డిఫరెంట్. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో ‘పెళ్లి’ ఓ మధుర ఘట్టం. అతిథుల ఆశీర్వచనాల మధ్యలో, మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల సాక్షిగా అంగరంగ వైభోవంగా జరిగే పెళ్లిల్లు.. అవేవీ లేకుండానే సాదాసీదాగా జరిగిపోతున్నాయి. కరోనా కారణంగా.. బంధువులు, కుటుంబ సభ్యులు పెళ్లి మండపానికి రావాల్సిన అవసరం లేదు. పందిట్లో పండితులు మంత్రాలు చదివాల్సిన పని లేదు. మేన మామ లాంఛనాలు అక్కర్లలేదు. తోబుట్టువులు హారతులు పట్టాల్సిన పనిలేదు. అంతెందుకు.. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్లు కూడా పక్కపక్కనే ఉండాల్సిన పనిలేదు. కానీ వీళ్లందరి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. చిటికెలో పెళ్లి జరిగిపోతోంది. కేరళలో అలానే జరిగింది. కొట్టాయం జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్ నాదేషన్ కు, అదే ప్రాంతానికి చెందిన అంజనాకు జనవరిలో పెళ్లి నిశ్చయించారు. కానీ అనివార్య కారణాల వల్ల పెళ్లి ఏప్రిల్ 26కి వాయిదా పడింది. అయితే అంజన ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవులో ని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆమె అక్కడే ఉండిపోయింది. దీంతో ఇంతకుముందే ఓ సారి పెళ్లి వాయిదా పడటంతో… మరోసారి కూడా అలా జరగకూడదని ఆన్ లైన్ పెళ్లి చేసుకోవాలని వధూవరులు ఇద్దరూ అనుకున్నారు. దాంతో శ్రీజిత్ అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ వధువు తండ్రి ఉండగా, పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్‌లో లైవ్‌లోకి వచ్చారు. ముహుర్తం టైమ్ కాగానే.. వరుడు శ్రీజిత్ తాళిబొట్టును ఫోన్‌కు వెనకవైపున కట్టాడు. అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. అంతే కొద్ది నిముషాల్లోనే పెళ్లి తంతు ముగిసింది. పక్కనే ఉన్న బంధువులు వారిని ఆశీర్వదించారు.
tags: lockdown, marriage, online marriage