గాలిలో అందమైన చిత్రాలు గీస్తున్న కేరళియన్

దిశ, ఫీచర్స్ : వివిధ ప్లాట్‌ఫామ్స్‌పై తమ చిత్రకళతో అద్భుతాలు చేస్తున్న ఆర్టిస్టుల గురించి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా మనం పేపర్‌, గ్లాస్, కాన్వాస్‌‌పై రంగులతో లేదంటే ఇసుకలో రూపొందించిన చిత్రాలనే చూశాం. కానీ ఇక్కడొక యువకుడు మాత్రం ఎలాంటి రంగులు వాడకుండా కేవలం చిన్న చిన్న రాళ్లతో అందమైన పోర్ట్రెయిట్స్ తయారు చేస్తున్నాడు. అంతేకాదు ఆ రాళ్లను గాల్లోకి విసిరినా అదే రూపం కనిపించేలా మ్యాజిక్ చేస్తున్నాడు. కేరళలోని పయ్యనూర్‌కు చెందిన కేపీ రోహిత్.. కాన్వాస్‌పై […]

Update: 2021-07-19 02:40 GMT

దిశ, ఫీచర్స్ : వివిధ ప్లాట్‌ఫామ్స్‌పై తమ చిత్రకళతో అద్భుతాలు చేస్తున్న ఆర్టిస్టుల గురించి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా మనం పేపర్‌, గ్లాస్, కాన్వాస్‌‌పై రంగులతో లేదంటే ఇసుకలో రూపొందించిన చిత్రాలనే చూశాం. కానీ ఇక్కడొక యువకుడు మాత్రం ఎలాంటి రంగులు వాడకుండా కేవలం చిన్న చిన్న రాళ్లతో అందమైన పోర్ట్రెయిట్స్ తయారు చేస్తున్నాడు. అంతేకాదు ఆ రాళ్లను గాల్లోకి విసిరినా అదే రూపం కనిపించేలా మ్యాజిక్ చేస్తున్నాడు.

కేరళలోని పయ్యనూర్‌కు చెందిన కేపీ రోహిత్.. కాన్వాస్‌పై రంగులకు బదులు స్టోన్స్‌తో వాడుతూ 6 సెకన్లలోనే చిత్రాలను రూపొందిస్తున్నాడు. కాగా అవే పోర్ట్రెయిట్స్‌ను గాల్లోకి విసిరినపుడు చెల్లాచెదురైన రాళ్లలో మళ్లీ అదే రూపం కనిపించడం విశేషం. హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన రోహిత్ చాలా కాలం నుంచి పెయింటింగ్స్ వేస్తుండగా.. స్టోన్స్ ఉపయోగించి చిత్రాలు వేయడం లాక్‌డౌన్‌ టైమ్‌లో మొదలుపెట్టాడు. రీసెంట్‌గా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చిత్రాన్ని ఇదే పద్ధతిలో గీయగా, సోషల్ మీడియాతో పాటు మోహన్‌లాల్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

ఈ మేరకు తన స్పెషల్ ఆర్ట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించిన రోహిత్.. ‘సోషల్ మీడియాలో ఇలాంటి ఒక వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల ప్రాక్టీస్ తర్వాత మొదటి చిత్రాన్ని పర్ఫెక్ట్‌గా వేయగలిగా. దాన్ని నా ఫ్రెండ్ హరిప్రసాద్ మొబైల్‌లో చిత్రీకరించాడు. అయితే ఆ స్టోన్ పోర్ట్రెయిట్‌ను అలాగే గాల్లోకి విసిరినపుడు స్లో మోషన్‌లో కొన్ని సెకన్ల పాటు మళ్లీ అదే రూపాన్ని చూడవచ్చు’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ, స్పానిష్ ఆర్టిస్ట్ సాల్వడార్ డాలితో పాటు చాలా మంది ఫిల్మ్ స్టార్ల స్టోన్ పోర్ట్రెయిట్స్ చిత్రీకరించాడు. కాగా గురువు ఎవరూ లేకుండా స్వతహాగా ఇలాంటి ఆర్ట్ నేర్చుకున్న రోహిత్.. ఇందులో ఎక్స్‌పర్ట్ అయ్యేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలిపాడు.

Tags:    

Similar News