మైనర్ ఆదివాసీ బాలిక హఠాత్తుగా ఓ బిడ్డకు ఎలా జన్మనిచ్చింది?.. అసలేం జరిగింది!

దిశ, ఫీచర్స్ : అడవి తల్లిని నమ్ముకున్న అమాయకులు.. కష్టమే తప్ప కల్మషం ఎరుగని గూడెం బిడ్డలు.. నాగరిక సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న అభాగ్యులు.. ఇలా చెప్పుకుంటే పోతే గిరిపుత్రులకు జరుగుతున్న అన్యాయాల పరంపరకు ఫుల్‌స్టాప్ ఉండదు. తరాల నుంచి అడవే ఆవాసమైనా.. వారికి శాశ్వత నివాసమన్నదే లేదు. పనికి తగ్గ ఫలితం దొరకదు. హక్కులున్నా అమలుచేసే దిక్కు ఉండదు. సాయం కోసం అర్థిస్తే స్పందించే మనిషి దొరకడు. ఇప్పటికీ ఎవరికైనా రోగమొస్తే భుజానేసుకుని మైళ్లదూరం పరుగెత్తాల్సిందే. […]

Update: 2021-10-17 01:06 GMT

దిశ, ఫీచర్స్ : అడవి తల్లిని నమ్ముకున్న అమాయకులు.. కష్టమే తప్ప కల్మషం ఎరుగని గూడెం బిడ్డలు.. నాగరిక సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న అభాగ్యులు.. ఇలా చెప్పుకుంటే పోతే గిరిపుత్రులకు జరుగుతున్న అన్యాయాల పరంపరకు ఫుల్‌స్టాప్ ఉండదు. తరాల నుంచి అడవే ఆవాసమైనా.. వారికి శాశ్వత నివాసమన్నదే లేదు. పనికి తగ్గ ఫలితం దొరకదు. హక్కులున్నా అమలుచేసే దిక్కు ఉండదు. సాయం కోసం అర్థిస్తే స్పందించే మనిషి దొరకడు. ఇప్పటికీ ఎవరికైనా రోగమొస్తే భుజానేసుకుని మైళ్లదూరం పరుగెత్తాల్సిందే. ఇదేనా అంటే ఆదివాసీ మహిళలు, బాలికలపై జరుగుతున్న బలత్కారాలు, అత్యాచారాలది మరో కోణం. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అడవి బిడ్డలు చనిపోతే ఖననం చేసేందుకు తమకంటూ గుంట జాగా లేకపోవడం చరిత గల స్వతంత్ర భారతాని సిగ్గుపడాల్సిన విషయం. ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఎన్నో సంఘటనలను, వారి నిస్సహాయతను కళ్లకు కట్టిన చిత్రం ‘కెంజిర’. స్కూల్‌కు వెళ్తున్న పదమూడేళ్ల ఆదివాసీ బాలిక హఠాత్తుగా ఓ బిడ్డకు ఎలా జన్మనిచ్చింది? తాయిళాలకు ఆశపడిన గూడెం పెద్ద.. దైవం పేరుతో అందరి బతుకులను ఏవిధంగా నట్టేట ముంచాడు? తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.

ఆదివాసీ గూడెంలోని జనాలు చేసేందుకు పనులులేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ పని దొరికినా నిరక్షరాస్యులు కావడంతో యజమానులు కూలి డబ్బుల్లో మోసం చేస్తుంటారు. ఇదిలా ఉంటే, కెంజిర అనే పదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు చేసేందుకు పని దొరక్క అర్థాకలితో నెట్టుకొస్తుంటారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు గంజాయి సరఫరాకు సిద్ధమైన కెంజిర తండ్రి.. పోలీసులకు పట్టుబడతాడు. కుటుంబ భారం తల్లి మీద పడటంతో ఆమె కెంజిరను, అతని తమ్మున్ని నానమ్మ దగ్గర వదిలి స్థానికంగా ఉండే అల్లం తోటల్లో పనికోసం వెళ్తుంది. కానీ అక్కడ శ్రమదోపిడీ జరుగుతోందని, ఆడవాళ్లు యజమాని చేతిలో లైంగికంగా వేధించబడుతున్నారనే విషయం అర్థమవుతుంది. కానీ వెనక్కి వచ్చే మార్గం కనబడదు.

మరోవైపు ఇంటి దగ్గర తినేందుకు తిండి లేకపోవడంతో కెంజిర సైతం తమ్మున్ని వదిలేసి అవే అల్లం తోటల్లో పనిచేసేందుకు వస్తుంది. కానీ అదే రాత్రి యజమాని చేతిలో అత్యాచారానికి గురవుతుంది. దీంతో తిరిగి గూడెం వెళ్లిపోయిన కెంజిర మళ్లీ స్కూల్‌‌కు వెళ్తుంటుంది. అయితే తొమ్మిది నెలల తర్వాత తనకు ఏం జరుగుతుందో తెలియని వయసులో ఊహించని విధంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ సంఘటనపై స్థానిక యువకుడు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో అల్లం తోటల యజమానిని అరెస్టు చేస్తారు. ఆ యువకుడు కెంజిరను పెళ్లిచేసుకుంటాడు. కానీ పోలీసులు మాత్రం మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆ యువకున్ని అరెస్టు చేస్తారు. మరి అతడు జైలు నుంచి బయటికి వచ్చాడా? మరోవైపు ఆ గూడెం ప్లేస్‌లో రిసార్ట్ కన్‌స్ట్రక్షన్ కోసం ప్లాన్ చేస్తున్న ఆ భూమి యజమాని వాళ్లను ఖాళీ చేయించేందుకు ఎలాంటి ప్లాన్స్ అమలు చేశాడు? గూడెం పెద్ద చనిపోతే ఎక్కడ పూడ్చిపెట్టారు? చివరికి వారంతా ఏమయ్యారు అనేది మిగతా స్టోరీ..

ఆగని దోపిడీ..

తరాలుగా అడవిలో నివాసముంటున్న ఆదివాసీలను టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్స్ రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో ఖాళీ చేయిస్తూ నిరాశ్రయుల్ని చేస్తున్నారు. ఇవి మా తాతల, తండ్రుల భూములంటూ అడవిలోకి అడుగుపెడుతున్న యజమానులు.. ఆ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి ఆదివాసీ బిడ్డలను తరుముతున్నారు. తప్పదనుకొని మరో చోటుకు వెళ్తే పోలీసుల దాడుల్లో గాయపడి చెట్టుకు ఒకరు, పుట్టకు ఒకరుగా చెల్లాచెదురై దిక్కులేని వాళ్లవుతున్నారు. ఎన్ని విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానం చంపుకోని గిరిపుత్రులు.. నేటి మోడ్రన్ సొసైటీలో మోసాలకు గురవుతూ తరతరాల దోపిడీకి ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News