నాగరాజు మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం !
దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెడపై ఉరేసుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదని విలపిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రిలో నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నెలన్నర క్రితం కీసర మండలం దయారా గ్రామంలో భూమికి సంబంధించి రూ.కోటి 10లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగరాజు చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. నిన్న […]
దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెడపై ఉరేసుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదని విలపిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రిలో నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నెలన్నర క్రితం కీసర మండలం దయారా గ్రామంలో భూమికి సంబంధించి రూ.కోటి 10లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగరాజు చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. నిన్న నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, సాయంత్రం కస్టడీ ముగిసిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురైన నాగరాజు ఉరేసుకొని చనిపోయాడు.